పశ్చిమ గోదావరి : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విపత్కర సమయంలో రాజకీయాల గురించి మాట్లాడడం క్షమించరాని నేరమని ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీలు అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజయసాయిరెడ్డి పై నీచమైన కామెంట్లు చేసినందుకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారన్నారు. బీజేపీకి అండగా అండగా ఉంటున్న జనసేనతో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శించారు. కరోనా కట్టడిలో ప్రపంచంలో భారత దేశం ముందుంటే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని జాతీయ మీడియా ప్రకటించింది.
'ఈ సమయంలో రాజకీయాలు చేయడం తగదు'